వలకు చిక్కిన కత్తి చేప.. ధర భారీయే.. - MicTv.in - Telugu News
mictv telugu

వలకు చిక్కిన కత్తి చేప.. ధర భారీయే..

October 18, 2020

ngfgnfg

కత్తిలాంటి మొనదేలిన ముక్కు ఉన్న చేపలను మనం సినిమాల్లో, కార్టూన్లలో చూసుంటాం. అలాంటివి సముద్రాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే ఏపీలో అలాంటి ఓ చేప మత్సకారుల వలకు చిక్కింది. శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ చేప ముక్కు మొనదేలిన కత్తిలా, పడవలను స్థైతం ధ్వంసం చేసే ఆకారంలో ఉండే చేప వలకు చిక్కింది. దానిని చూసి వేటగాళ్లు తొలత భయపడ్డారు. 300 కిలోల బరువు ఉన్న ఆ చేపను స్థానికంగా కొమ్ము కోనేము చేప అని పిలుస్తారని స్థానికులు తెలిపారు. 8 అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ భారీ చేపకు మార్కెట్‌లో రూ.8500 పలకింది.  చేపను విశాఖకు చెందిన ఓ వ్యాపారి రూ.8500 చెల్లించి కొనుగోలు చేశాడు. దీంతో మత్స్యకారుని ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. 

ఇంతవరకు ఇంత పెద్ద చేప తమ వలకు ఎప్పుడూ చిక్కలేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ భారీ చేపని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కాగా, ఇలాంటి చేపే ఒకటి గత నెలలో ప్రకాశం జిల్లాలో ఓ జాలరికి చిక్కింది. చీరాల మండలం వాడరేవు తీరంలో దోనిదేవుడు అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా అతని వలకు అనూహ్యంగా 28 కిలోల అరుదైన కచ్చిలి చేప చిక్కింది. దీంతో అతను ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఆ చేపను కొనుగోలు చేసేందుకు పలువురు పోటీలు పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.1.70 లక్షలు పెట్టి ఆ చేపను కొనుగోలు చేశాడు.