A five-year-old boy died after being bitten by a snake , in Tamil Nadu
mictv telugu

తల్లిని కాపాడబోయి పాముకాటుతో బాలుడు మృతి

August 21, 2022

 

తల్లిని కాపాడబోయి ఐదేళ్ల బాలుడు పాము కాటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందాడని డాక్టర్లు చెప్పడంతో.. ఆ కుటుంబం విషాదంలో మునిగింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సౌత్ కుప్పనపురం అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పెరుమాల్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమారుడు తల్లితో వంటగదిలో ఉండగా.. గోడ పక్కన ఉన్న రంధ్రంలో నుంచి పాము రావడం గమనించాడు. పాము తన తల్లి వద్దకు రాకుండా అడ్డుకునేందుకు చేసే ప్రయత్నంలో ఆ చిన్నారిని పాము కాటు వేసింది. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రథమ చికిత్స కోసం బాలుడిని కదంబుర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరునెల్వేలిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించగా బాలుడు చనిపోయాడని డాక్టర్ తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.