A football match in zero gravity on an airplane
mictv telugu

నేలకు 20 వేల అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్ మ్యాచ్.. గిన్నీస్ రికార్డు సాధించిన వీడియో

October 1, 2022

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన క్రీడల్లో ఫుట్ బాల్ ఆట మొదటిస్థానంలో ఉంటుంది. భారీ మైదానాలలో వేలాది ప్రేక్షకుల మధ్య జరిగే మ్యాచులు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. తమ అభిమాన ఆటగాళ్లు, జట్లు విజయం సాధించాలని ప్రేక్షకులు వారిని ఉత్సాహపరుస్తుంటారు. ఇదంతా కామన్‌గా జరిగేదే. అయితే ఇప్పుడు చెప్తున్న మ్యాచ్ మాత్రం మిగతా వాటికంటే భిన్నంగా జరిగింది. జీరో గ్రావిటీలో జరిగి ఏకంగా ప్రపంచ రికార్డు సాధించింది. గిన్నీస్ రికార్డు సాధించిన ఈ మ్యాచ్ విమానంలో 20,230 అడుగుల ఎత్తులో జరిగింది. మాస్టర్ కార్డ్ స్పాన్సర్ చేసిన ఈ మ్యాచ్ లో ఆటగాళ్లు రెండు టీములుగా విడిపోయి ఆడారు. మొదట మామూలుగా స్టార్ట్ అయిన మ్యాచ్.. జీరో గ్రావిటీ రాగానే ఆటగాళ్లు గాల్లో తేలిపోయారు. తేలుతూనే అచ్చం మైదానంలో ఆడినట్టే తలతో నెట్టడం, కాలితో తన్నడం వంటి ఫీట్లు చేశారు. భిన్నంగా సాగిన ఈ మ్యాచులో రెడ్ టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచులో పాల్గొన్న ప్రఖ్యాత ఫ్రెంచ్ ఆటగాడు ఫిగో తన అనుభూతిని మీడియాకు వివరించాడు. (ఫుట్ బాల్ క్రీడ సరిహద్దులను చెరిపేసి ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. నేను భూమ్మీద చాలా మైదానాల్లో ఆడాను కానీ, భూమికి 20 వేల అడుగుల ఎత్తున విమానంలో ఆడడం అద్భుతంగా అనిపిస్తోంద’ని వెల్లడించాడు. ఈ వీడియోను యూట్యూబులో రిలీజ్ చేయగా, అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది.