A girl was shot at for not chatting in Delhi
mictv telugu

ఢిల్లీలో దారుణం.. చాటింగ్ చేయట్లేదని బాలికపై కాల్పులు

August 27, 2022

A girl was shot at for not chatting in Delhi

సరదాగా వాడాల్సిన సోషల్ మీడియాను సీరియస్‌గా తీసుకుంటే కొన్ని సార్లు ప్రాణాల మీదకు వస్తుంది. ముఖ్యంగా బాలికలు, అమ్మాయిలు ముక్కూ మొఖం తెలియని వారితో చాటింగ్ చేస్తే ప్రమాదరకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి హెచ్చరికతో కూడిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఇంటర్ చదువుతున్న ఓ 16 ఏళ్ల బాలికు రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో ఆర్మాన్ అలీ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే స్నేహం పెరిగి రోజూ చాటింగ్ చేసుకునేవారు.

ఈ క్రమంలో అలీ బాలికను ప్రేమించడం మొదలెట్టాడు. అయితే ఏమైందో తెలియదు కానీ, కొన్ని రోజులుగా బాలిక అలీని దూరం పెట్టసాగింది. సోషల్ మీడియాలో మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చేది కాదు. దీంతో అలీ బాలికపై కోపం పెంచుకున్నాడు. కోపంలో కంట్రోల్ తప్పి బాలికపై దాడి చేయడానికి ప్లాన్ చేశాడు. ఇందుకు తన స్నేహితులు బాబీ, పవన్‌ల సాయం తీసుకున్నాడు. గురువారం ఆ బాలిక కళాశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో బాలికపై పలుమార్లు కాల్పులు జరిపాడు. బాలిక రక్తపు మడుగులో పడిపోవడంతో ముగ్గురూ పారిపోగా, స్పందించిన స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.