A girl was skipping while riding a bicycle
mictv telugu

సైకిల్ తొక్కుతూ స్కిప్పింగ్.. వీడియో చూసి తీరాల్సిందే

January 6, 2023

సోషల్ మీడియా వచ్చాక చాలా మంది తమ ప్రతిభ ఏంటో ప్రపంచానికి చాటి చెప్తున్నారు. సాధారణంగా ఆలోచిస్తే సాధ్యం కాని పనులను చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. తమ టాలెంటుతో అభిమానులను సంపాదించుకుంటూ తమ ఖాతాలకు ఫాలోవర్లను కూడా పెంచుకుంటున్నారు. అలాంటి టాలెంట్ ఉన్న ఓ యువతి వీడియో ఇది. చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. సైకిల్ పై తనకే సొంతమైన విన్యాసాన్ని చేసి చూపిస్తోంది. ఐయామ్ సీక్రెట్ గర్ల్ అనే ఇన్ స్టా ఐడీతో సైకిల్ తొక్కుతూ పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం చేస్తూంటుంది. 7 లక్షల ఫాలోవర్లు ఉన్న ఈ యువతి తాజాగా చేసిన స్టంట్ అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు. సైకిత్ తొక్కుతూ హ్యాండిల్ వదిలేసి రెండు చేతులతో స్కిప్పింగ్ చేసిన విధానాన్ని చూసి తీరాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటికే వేల సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకుంది. యువతి టాలెంటుకు ఫిదా అయినట్టు చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.