A girl writing with both hands at the same time
mictv telugu

రెండు చేతులతో 11 రకాలుగా రాస్తున్న బాలిక.. వీడియో ఇదిగో

August 10, 2022

అక్షరాలను మనం ఒక్కచేతితో రాయాలంటేనే కంఫర్ట్‌గా ఉంటుంది. అలాంటిది రెండు చేతులతో రాయాలంటే కాస్త ఇబ్బంది పడాల్సిందే. అయితే వీడియోలోని ఓ యువతి మాత్రం రెండు చేతులతో రాయడమే కాక, 11 రీతుల్లో చకచకా రాసేసి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఈ బాలిక సవ్య దిశలో, అపసవ్య దిశలో, ఒక చేత్తో సవ్య దిశలో, మరో చేత్తో అపసవ్య దిశలో వేగంగా రాసేస్తుంది. అంతేకాక, ఆంగ్లం, కన్నడ, తెలుగు సహా పలు భాషల్లోని అక్షరాలను బోర్డుపై మంచినీళ్లు తాగినంత ఈజీగా బోర్డుపై దింపేస్తుంది. భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ ఆఫీసర్ అనిల్ చోప్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది. ఈ టాలెంటు పది లక్షల మందిలో ఒకరికి ఉంటుందని, ఈ తరహా శక్తిని ఆంబిడెక్సెరిటీగా పిలుస్తారని వీడియోపై క్యాప్షన్ పెట్టారు. మెదడులోని రెండు భాగాలు కలిసి పని చేయడం వల్ల ఈ అద్భుత శక్తి వస్తుందని వెల్లడించారు. వీడియోలోని బాలిక పేరు ఆది స్వరూప కాగా, నిజంగానే ఆదిస్వరూపిణి అంటూ పొగడ్తలు గుప్పించారు.