a goods train derailed near Rajahmundry Yard station
mictv telugu

ఏపీలో పట్టాలు తప్పిన రైలు..పలు రైళ్లు రద్దు

November 9, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దవ్వగా..మరికొన్ని రైళ్లను దారి మళ్ళించారు. ఇంకా కొన్నిరైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్‌పై మరమత్తులు చేపట్టారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో తొమ్మి రైళ్లను రద్దు చేయగా..మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు విజయవాడ రైల్వే డీఆర్ఎం ట్వీట్ చేసారు. రద్దయిన వాటిలో విజయవాడ నుంచి విశాఖపట్నం, గుంటూరు-విశాఖపట్నం, విజయవాడ-కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. విజయవాడ -లింగంపల్లి(12805) రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది.