A great opportunity for candidates..1,901 job advertisement
mictv telugu

అభ్యర్థులకు చక్కటి అవకాశం..1,901 ఉద్యోగాలకు ప్రకటన

September 6, 2022

దేశవ్యాప్తంగా డీఆర్డీవో (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు డీఆర్డీవో యాజమాన్యం ఓ శుభవార్తను చెప్పింది. డీఆర్డీవోలో ఖాళీగా ఉన్న 1,901 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేశామని, ఈ ఉద్యోగాలను బీటెక్, పదోవ తరగతి అర్హతతోనే భర్తీ చేస్తున్నామని ప్రకటించారు.

”మొత్తం 1,901 ఉద్యోగాలు. ఇందులో 1,075 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి, 826 టెక్నీషియన్-ఎ పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 28 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్లు పంపించాలి. మొత్తం రెండు స్థాయిల్లో అభ్యర్థులను పరీక్షించనున్నారు. టైర్-1, టైర్-2 పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన అభ్యర్ధులను దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది ఎంపిక చేస్తారు.

ఇక, ఈ ఉద్యోగాలకు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులకు సైన్స్ గ్రూపుల్లో గ్రాడ్యుయేషన్ (లేదా) ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, అనుబంధ సబ్జెక్టుల్లో డిప్లొమా చేసినవారు అర్హులు. టెక్నీషియన్-ఎ పోస్టులకు పదోవ తరగతి, తత్సమాన అర్హతతోపాటు ఐటీఐ చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు రూ. 100. మహిళ, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తులకు చివరితేదీ సెప్టెంబర్ 23. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1.12,400 వరకూ వేతనం ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు..www.drdo.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి” అని అధికారులు వివరాలను వెల్లడించారు.