A Gujarat court sentenced a farmer to six months in jail for leaving his cattle on the road
mictv telugu

రైతులకు హెచ్చరిక.. 6 నెలల జైలు శిక్ష విధించిన హైకోర్టు

November 22, 2022

A Gujarat court sentenced a farmer to six months in jail for leaving his cattle on the road

పశువులున్న రైతులకు గుజరాత్ హైకోర్టు హెచ్చరిక పంపింది. పశువులను విచ్చలవిడిగా రోడ్లపై వదిలేసి సమస్యగా మారిన రైతుకి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించినందుకు ప్రకాశ్ జైరాం దేశాయ్ అనే రైతుకి ఈ శిక్ష ఖరారు చేసింది.

2019లో సీఎన్సీడీ టీం ఐదు పశువులను గుర్తించి పట్టుకోగా, జైరామ్ దేశాయ్ పై కేసు నమోదైంది. గుజరాత్ పోలీస్ చట్టం, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు.దీన్ని విచారించిన కోర్టు.. పశువులను రోడ్లపై వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడింది. ఇతర రైతులు తమ పశువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలలో పశువులను విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. దీంతో అటు పశువులతో పాటు సాధారణ ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.