A Gujarati girl who married herself
mictv telugu

పంతం నెగ్గించుకుంది.. తనను తనే పెళ్లాడింది.

June 9, 2022

A Gujarati girl who married herself

తనను తానే పెళ్లి చేసుకుంటానంటూ సంచలన ప్రకటన చేసిన గుజరాతీ యువతి క్షమాబిందు ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. వరుడు, పురుహితుడు లేకుండా తన ఇంట్లోనే వివాహ తంతు కానిచ్చేసింది. ఇంతకు ముందు గుడిలో పెళ్లి చేసుకుంటానని యువతి ప్రకటించగా, హిందూ వివాహ పద్ధతికి వ్యతిరేకమంటూ స్థానిక బీజేపీ నేత హెచ్చరించాడు.

తర్వాత సాంప్రదాయానికి విరుద్ధమంటూ పురోహితుడు కూడా నిరాకరించడంతో స్వంతంగా చేసుకోవాలని నిశ్చయించుకుంది. వాస్తవానికి పెళ్లి ముహూర్తం జూన్ 11న పెట్టుకోగా, అవాంతరాలతో ఈ నెల 8న బుధవారం రోజు పెళ్లి కార్యక్రమం పూర్తి చేసింది. బట్టల కోసం తానే షాపింగ్ చేసింది. అచ్చం పెళ్లి కూతురిలా ముస్తాబై, అద్దంలో తనను తానే ముద్దాడి ముచ్చట తీర్చుకుంది. ఆ తర్వాత మంగళ సూత్రం మెడలో ధరించి తనకు తానే భార్యగా మారింది. అయితే అందరిలా తాను పుట్టింటిని విడిచి వెళ్లడం లేదని లోగడ స్పష్టం చేయగా, ఇప్పుడు కూడా అదే మాట మీద నిలబడింది. తాను వధువులా మారాలనుకున్నానే తప్ప ఒక మగాడికి భార్యగా కాదని పేర్కొంది. కాగా, సాంప్రదాయానికి విలువనిచ్చే భారత దేశంలో క్షమాబిందు వివాహం తొలి సోలోగమీగా రికార్డుకెక్కింది.