A helicopter that hit power lines and crashed in brazil
mictv telugu

కరెంటు తీగలకు తగిలిన హెలికాప్టర్.. తర్వాత ఏమైందంటే.. వీడియో

September 23, 2022

గాల్లో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో పొరపాటున కరెంటు తీగలకు తగిలింది. కానీ, అందులోని ప్రయాణీకులకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా బయటపడ్డారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బ్రెజిల్ దేశంలోని మినాస్ గెరైస్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎనిమిది మంది హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే టేకాఫ్ సమయంలో అక్కడున్న విద్యుత్ తీగలకు తగిలి కింద పడిపోయింది. మంటలు చెలరేగక ముందే పొగ రాగా, ఆలోపే అందులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడగలిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమీపంలో ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు ధృవీకరించారు. తర్వాత ఘటనపై విచారణ జరుపగా, పైలెట్ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.