A Hindu priest who became a Muslim.. a twist within a few hours..
mictv telugu

ముస్లింగా మారిన హిందూ పూజారి..కొన్ని గంటలకే ట్విస్ట్..

August 22, 2022

A Hindu priest who became a Muslim.. a twist within a few hours..

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ హిందూ పూజారి ఇస్లాం మతంలోకి మారిన సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అప్పటివరకు హిందూ దేవతలను పూజించిన అతడు ఇస్లాం మతంలోకి ఎందుకు మారాడని చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తుమకూరు జిల్లాలోని హిరేహళ్లి ఓంకారేశ్వర ఆలయంలో చంద్రశేఖరయ్య (61) పూజారిగా ఉన్నాడు. గతవారం చంద్రశేఖరయ్య తాను ఇస్లాం మతంలోకి మారాలి అని నిర్ణయించుకున్నట్లు ఓ ప్రకటన జారీ చేశారు.

ఆ ప్రకటనలో..”నా సోదరులకు నాకు ఆలయ అర్చకత్వం విషయంలో, ఆస్తుల విషయంలో విభేధాలు వచ్చాయి. అందుకే నేను హిందూ మతం వదిలి ఇస్లాం మతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. నా పేరును ముబారక్ పాషాగా మార్చుకుని, స్థానిక వార్తాపత్రికలో ప్రకటన చేశాను.” అని పేర్కొన్నాడు. అంతేకాదు, ఇస్లాం మతంలోకి మారిన కొన్ని గంటలకే చంద్రశేఖరయ్య ముస్లిం వేషధారణలో కోరగెరె తాలూకాలోని తోవినకెరె గ్రామంలోని మసీదులో ప్రార్థన చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ క్రమంలో పేపర్‌లో చంద్రశేఖరయ్య ఇచ్చిన ప్రకటనను, ఫోటోలను వీక్షించిన తుమకూరు జిల్లా మాజీ మంత్రి సొగడు శివన్న చంద్రశేఖరయ్య ఇంటికి చేరుకొని, మళ్లీ హిందూ మతంలోకి రావాలని ఆయనను ఒప్పించారు. దాంతో చంద్రశేఖరయ్య తన నిర్ణయం మార్చుకొని, మళ్లీ హిందూ మతంలోకి వచ్చారు. చంద్రశేఖరయ్య మాట్లాడుతూ..”అన్నయ్య గొడవతో విసిగిపోయాను. నేను చనిపోతే నా శవాన్ని పాతిపెడతారు అని నిర్ణయించుకుని మతం మారాలని నిర్ణయించుకున్నాను. కానీ, ఇప్పుడు నేను తిరిగి వచ్చాను. మతమార్పిడి జరగాలంటే సున్నతి అయి ఉండాలి. నాకు డయాబెటిస్ ఉన్నందున నేను చేయలేను. మాజీ మంత్రి సోగడు శివన్న నాతో మాట్లాడి, నన్ను ప్రక్షాళన చేయడానికి నన్ను ఒక జ్ఞాని వద్దకు తీసుకెళ్లారు. నేను మరోసారి లింగాయత్ దీక్ష తీసుకుంటాను. నేను హిందువుని, హిందువుగానే ఉంటాను”అని అన్నారు.