A Hindu temple received a threatening call to cancel an Australian bhajan program
mictv telugu

Australia:ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయానికి చెదిరింపులు..’భజన ఆపకపోతే’ అంటూ..!!

February 17, 2023

A Hindu temple received a threatening call to cancel an Australian bhajan program

గతకొన్నాళ్లుగా కెనడా, ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై విధ్వంసం జరుగుతున్న ఘటనలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఆస్ట్రేలియా ఈ ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. మెల్‎బోర్న్ లోని ఓ హిందూదేవాలయం పూజారిని బెదిరించారు హిందూ విద్వేషకులు. ఆస్ట్రేలియన్ టుడ్ కథనం ప్రకారం…మెల్ బోర్న్ లోని కాళీమాత ఆలయంలో జరుగుతున్న భజనలు ఆపేయాలని లేదంటే పర్యవసాలను ఎదుర్కొవల్సివస్తుందని బెదిరంచారు.

తనను బెదిరించిన వ్యక్తి పంజాబీలో మాట్లాడుతున్నాడని ఆలయ అధికారి తెలిపినట్లు కథనంలో పేర్కొన్నారు. మంగళవారం తనకు నో కాలర్ ఐడీ నుంచి కాల్ వచ్చిందని..మార్చి 4న నిర్వహించనున్న భజన కార్యక్రమాన్ని రద్దు చేయాలని బెదిరించినట్లు తెలిపారు. కాగా మార్చి 4న కాళీమాత ఆలయంలో భారీఎత్తున భజనకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేఫథ్యంలో వేలాదిమంది హిందువులు కాళీమాత ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ హెచ్చరికలు రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు తెలిపినట్లు వెల్లడించారు.