A Hindu woman who contested and won on behalf of Majlis
mictv telugu

మజ్లీస్ తరుపున పోటీ చేసి గెలిచిన..హిందూ మహిళ

July 21, 2022

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లీస్ తరుపున పోటీ చేసిన ఓ హిందూ మహిళ అరుణ ఉపాధ్యాయ గెలుపొందింది. అనంతరం తన విజయానికి కారణమైన మజ్లీస్ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి కృతజ్ఞతలు తెలియజేసింది. అంతేకాదు, ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేరుస్తానని మాటను ఇచ్చింది.

 

మధ్యప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారి మజ్లీస్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొదటి ఫేజ్‌లోనే ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించి మజ్లీస్ నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఇప్పుడు రెండో ఫేజ్‌లోనూ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే, ఏకంగా మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ఖార్‌గావ్‌ మున్సిపల్‌ స్థానం విజయం ప్రత్యేకంగా నిలవడంతో ప్రస్తుతం అక్కడి రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతుంది.

గృహిణి అయిన అరుణ శ్యామ్‌ ఉపాధ్యాయ…ఆమె భర్త శ్యామ్‌ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమవేత్త. రాజ్యాంగం, దళిత-వెనుకబడిన వర్గాల వాదనకు ఆకర్షితుడై ఎంఐఎంలో చేరాడు. తొలుత పార్టీ సీటును శ్యామ్‌కే కేటాయించాలనుకుంది. కానీ, అనూహ్యంగా స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే అరుణకు బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్‌ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ తన అనుచరులతో ప్రచారం చేయించినప్పటికీ, అరుణనే గెలుపు అందుకుంది.