భళా అక్షయ్ .. 25 కుటుంబాలకు కోటి రూపాయలు  - MicTv.in - Telugu News
mictv telugu

భళా అక్షయ్ .. 25 కుటుంబాలకు కోటి రూపాయలు 

October 29, 2019

సెలబ్రిటీలకు సామాజిక స్పృహ ఉండి, వారు ఎదుటివారికి సాయం చేస్తే వారి హోదాకు మరింత అందం, గౌరవం పెరుగుతుంది. ఆ విషయంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముందు ఉంటారు అని అనవచ్చు. ఆయన ఒకటే సినిమాలు చేయకుండా తనను ఈ స్థాయికి చేర్చిన జనాలు రుణం తీర్చుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన బీహార్ వ‌ర‌ద‌బాధితుల‌కు త‌న వంతు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు . వ‌ర‌ద‌ల్లో న‌ 25 కుటుంబాలు రోడ్డున ప‌డ‌గా, ఒక్కో కుటుంబానికి 4 ల‌క్ష‌ల చొప్పున సాయం అందించనున్నారు. చాత్ పూజ శుభ సందర్భంగా రూ. 1 కోటి రూపాయ‌ల మొత్తాన్ని అందజేస్తారు. 

Akshay Kumar.

ప్రకృతి కన్నెర్రజేయడంతో  మనుషులు రోడ్డున ప‌డుతున్నారు. వారికి సాధ్యమైనంత సహాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని అక్షయ్ పిలుపునిచ్చారు. తోటి పౌరుల జీవితాలను పునర్నిర్మించడం కోసం చేసే స‌హాయం తనకు ఎనలేని సంతృప్తిని ఇస్తుందని అక్ష‌య్ అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎప్పుడూ తన కుటుంబ సభ్యులే అన్నారు. వారికి సాయం చేయడం తన బాధ్యత అని అన్నారు. కాగా, అక్ష‌య్ న‌టించిన తాజా చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’ ఇటీవలే విడుదల అయి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అక్షయ్ పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.