A huge fraud in Hyderabad in the name of Digital India Private Limited
mictv telugu

హైదరాబాద్‌లో ఘరానా మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 కోట్లు వసూలు

July 6, 2022

A huge fraud in Hyderabad in the name of Digital India Private Limited

ఉద్యోగ వేటలో ఉన్న యువతనే టార్గెట్‌గా చేసుకొని భారీ మోసానికి పాల్పడింది ఓ బోగస్ కంపెనీ. ఆన్‌లైన్‌ జాబ్‌, వర్క్‌ఫ్రమ్‌ హోం అని చెప్పి, నిరుద్యోగుల నుంచి డిపాజిట్ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ మోసానికి పాల్పడింది. నెలకు రూ.3లక్షల పైనే జీతం అంటూ ఫోన్ కాల్స్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడ్డారు.

బాధితుల కథనం ప్రకారం.. పుస్తకాలు స్కాన్ చేసి పంపాలంటూ కస్టమర్స్‌కు వర్క్ ఫ్రం హోం అప్పజెప్పింది సదరు కంపెనీ. అంతర్జాతీయ పుస్తకాలు, నవలలు డిజిటల్‌ చేస్తామని.. ప్రతీ పేజీకి రూ.5 చొప్పున ఇస్తామని ప్రకటించింది. అయితే పదివేల పేజీల స్కానింగ్‌ కోసం డిపాజిట్లను వసూలు చేసింది. డిపాజిట్‌ పేరిట ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి ఐదు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేసింది. ఈవిధంగా నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. 700 మంది నుంచి రూ.50కోట్ల మేర డిపాజిట్లు కట్టించుకుని కంపెనీ ప్రతినిధులు పారిపోయారు. కంపెనీ ఎండీ అమిత్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. శర్మతో పాటు విజయ్‌ ఠాగూర్‌ అనే వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.