A huge Ganesha leaning sideways in the gajuwaka
mictv telugu

గాజువాకలో పక్కకు ఒరిగిన భారీ గణేశుడు.. స్థానికుల భయాందోళన

September 10, 2022

A huge Ganesha leaning sideways in the gajuwaka

ఏపీలోని విశాఖపట్టణం గాజువాకలో ఏర్పాటు చేసిన 89 అడుగుల భారీ గణేష్ మట్టి విగ్రహం భక్తులకు ఆందోళనకు గురి చేస్తోంది. ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోవడంతో ఎక్కడ విగ్రహం పడిపోతుందోనని స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం వేలాదిగా భక్తులు దర్శించుకుంటుండడంతో ఏ క్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మండపానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులను పిలిపించగా, ప్రమాదానికి అవకాశాలున్నాయని వారు తేల్చి చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విగ్రహానికి వంద మీటర్ల వరకు ఎవరినీ అనుమతించడం లేదు. విగ్రహాన్ని వెంటనే నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించగా, ఈ నెల 18వ తేదీన నిమజ్జనం చేసేలా నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు కుదరదని స్పష్టం చేసింది. అయితే అర్ అండ్ బీ, పోలీసుల ఆదేశాల మేరకు దర్శనం నిలిపివేసి సోమవారం సాయంత్రం నిమజ్జనం చేస్తామని వివరించారు. ఈ విషయంలో ఎలాంటి తప్పుడు ప్రచారానికి, గందరగోళానికి లోను కావద్దని భక్తులను కోరారు.