A huge idol of Durga Mata made..here are the details
mictv telugu

తయారైన భారీ దుర్గామాత విగ్రహాం..వివరాలు ఇదిగో

September 23, 2022

దేశవ్యాప్తంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని నిర్వాహకులు పెద్ద పెద్ద మండపాలను పలు రకాల డిజైన్‌లతో తయారు చేస్తున్నారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు నిలిచిపోయిన ఈ దుర్గామాత ఉత్సవాలు ఈసారి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అయితే, ఈసారి ఉత్తర కోల్‌కతాలోని సోవాబజార్ ప్రాంతంలోని క్లబ్ వారు తయారు చేసిన భారీ దుర్గామాత విగ్రహానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

విగ్రహం విశేషాలు..
1. వెయ్యి కిలోగ్రాముల కంటే కొంచెం ఎక్కువ బరువున్న దేవతా విగ్రహం ఇది.
2. రాక్షస సంహారకుడి భారీ విగ్రహం ఇంత గొప్పగా తయారు చేయడం ఇదే మొదటిసారి.
3. ఆక్టో-అల్లాయ్‌తో తయారు చేసిన, ఈ దుర్గా దేవి విగ్రహం 11 అడుగుల ఎత్తు ఉంది.
4. ‘అష్టధాతు’ గణేష్, లక్ష్మి, సరస్వతిలతో పూర్తి సెట్‌ విలువ 15 లక్షలు.
5. అత్యంత ఖరీదైన విగ్రహంగా ఇది రికార్డు బ్రేక్ చేసింది.

ఇక, విగ్రహం తయారీ విషయానికొస్తే..”మింటూ కళాకారుడి చేతిలో రూపుదిద్దుకున్న విగ్రహానికి ఆయనతో పాటు చాలామంది కళాకారులు మెరుగులు దిద్దారు. ఫైబర్ నిర్మాణానికి మొదటి బృందం మూడు నెలల పాటు పనిచేసింది. ఆ తర్వాత విగ్రహం మీద ఆక్టో అల్లాయ్ పూతకి మరో ఐదున్నర నెలలు సమయం పట్టింది. ఈ విగ్రహం స్థానిక ప్రాంతంలోని ఒక ఆలయంలో ఉంచి ఈ సంవత్సరం దుర్గాపూజ ఉత్సవంలో పూజించినా, ఆ తరువాత ఓ ప్రత్యేకమైన గుడిని నిర్మించి అందులో ఈ విగ్రహాన్ని ఉంచనున్నాం” అని నిర్వాహకులు తెలియజేశారు.