ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం

March 19, 2022

మహిళల ప్రపంచకప్ 18వ మ్యాచ్‌లో భాగంగా శనివారం భారత్ – ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటగా టాస్ ఓడిన భారత్.. బ్యాటింగ్‌కు దిగింది. 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. అంటే ఆస్ట్రేలియా ముందు 278 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ సందర్భంగా కెప్టెన్ మిథాలీ రాజ్ (68) టాప్ స్కోరర్‌గా నిలిచింది. యాస్టికా భాటియా (59) పరుగులు చేసి ఔట్ కాగా, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (57) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

అనంతరం ఆస్ట్రేలియా తరపున డార్సీ బ్రౌన్ 3 వికెట్లు పడగొట్టింది. భారత్ ఆరంభంలోనే వికెట్ కీపర్ రిచా ఘోష్ (8), స్నేహ రాణా (1) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్, పూజా వస్త్రాకర్ 7వ వికెట్‌కు 47 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కేవలం 28 బంతుల్లో 34 పరుగులు చేసిన పూజా భారత ఇన్నింగ్స్ చివరి బంతికి ఔట్ కాగా, హర్మన్ 47 బంతుల్లో అజేయంగా 57 పరుగులు చేసింది.