A hundred students died in Kabul
mictv telugu

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 100 మంది విద్యార్ధుల మత్యువాత!

September 30, 2022

తాలిబన్ పరిపాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. రాజధాని కాబూల్‌లో ఓ విద్యాకేంద్రంలో ఆత్మాహుతి దాడి జరుగగా సుమారు వందమంది చనిపోయినట్టు తెలుస్తోంది. అధికారికంగా 19 మంది స్టూడెంట్స్ చనిపోగా, 27 మంది గాయపడ్డారని కాబూల్ పోలీస్ చీఫ్ వెల్లడించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మూడో అతిపెద్ద కమ్యూనిటీ అయిన హజారాలేనని తెలుస్తోంది.

కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్లో యూనివర్సిటీ ఎంట్రన్స్ మాక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానికి ప్రిపేర్ అవుతండగా ఈ పేలుడు జరిగింది. ఆత్మాహుతికి ముందు, తర్వాత అంటూ విడుదల చేసిన వీడియోలు కంటతడి పెట్టిస్తున్నాయి. మొదటి వీడియోలో నవ్వుతూ ఉన్న విద్యార్ధులు.. రెండో వీడియోలో మాత్రం మాంసం ముద్దలతో కనిపించారు. గోడల నిండా రక్తపు మరకలతో ఆ ప్రాంతం బీభత్సంగా కనిపించింది.  సుమారు వంద మంది చనిపోయారని భావిస్తుండగా, స్థానికులు మాత్రం అంతకన్నా ఎక్కువే ఉంటారని చెప్తున్నారు. ఈ ఘటనున అమెరికా, పాకిస్తాన్ దేశాలు ఖండించాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాలని పాక్ ప్రధాని ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని తెలిపారు. అందుకు ప్రపంచ దేశాల సహాయం కావాలని కోరారు.