A husband gave his wife to her lover in Bihar
mictv telugu

మహానుభావుడు.. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను త్యాగం చేశాడు

December 28, 2022

A husband gave his wife to her lover in Bihar

యువతీయువకులు ప్రేమించుకునేది పెళ్లి కోసమే. వివాహమైన తర్వాత నచ్చిన వ్యక్తితో జీవితాంతం సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో ఎంతకైనా తెగిస్తారు. కానీ బీహార్ లో మాత్రం ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను త్యాగం చేశాడు. చిత్రంగా అనిపించే ఈ ఘటనలో భర్త మంచి మనసు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జెహనాబాద్ జిల్లా కుమ్డి గ్రామానికి చెందిన రాంరాజ్ అనే యువకుడు మిఠాయిల వ్యాపారం చేస్తుంటాడు. రెండేళ్ల క్రితం సోలండా గ్రామానికి చెందిన రూప కుమారితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. కొత్త జంట నగరంలోని తోట మొహల్లాలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో రూపకు ఓ నెట్ వర్కింగ్ కంపెనీలో ఉద్యోగం రాగా ఇటు భర్త, అటు ఉద్యోగాన్ని మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవిస్తోంది. అయితే రూపకు ఆరు నెలల తర్వాత కంపెనీలో పని చేసే రంజిత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత స్నేహంగా మారి ప్రేమకు దారి తీయగా, అప్పటికే వివాహమైన రూప.. భర్త పని మీద బయటకి వెళ్లే సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని ఎంజాయ్ చేసేది.

గత ఆదివారం రోజులానే భర్త రాంరాజు బయటికి వెళ్లిపోగా యథాలాపంగా రూప యువకుడిని ఇంటికి రప్పించుకుంది. అయితే బయటికి వెళ్లిన భర్త రాంరాజు ఏదో గుర్తుకు వచ్చి ఇంటికి రాగా, ఇంట్లో కనపడిన సీన్ చూసి హతాశుడయ్యాడు. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న తన భార్య రూపను చూసి కోపంతో వాళ్లిద్దరినీ రూంలోనే ఉంచి తలుపులు మూసి తాళాలేశాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తన భార్య వివాహేతర సంబంధాన్ని ప్రత్యక్షంగా చూపించాడు. పోలీసులు విచారించగా, గత ఆరు నెలల నుంచి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని తెగేసి చెప్పేసింది. ప్రియుడు రంజిత్ కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో రాంరాజు ఆశ్చర్యపోయాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇంకొకరిని ప్రేమించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇద్దరిని ప్రేమించే ప్రేమ ప్రేమ కాదని భావించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన ముందే మరొక వ్యక్తిని ఇష్టపడుతున్నానని చెప్పిన భార్యను తన వద్దే ఉంచుకుంటే తనకు కూడా సంతోషం, సుఖం ఉండదని భావించి వారిద్దరికీ పెళ్లి చేయండని కోరాడు. ఈ మేరకు పోలీసులకు లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు.