కఠినమైన చట్టాలు ఎన్ని వచ్చినా…మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదొక చోట మహిళలు హత్య, అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో దారుణం జరిగింది. భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను చంపి ముక్కలుగా నరికి రెండు నెలల పాటు వాటర్ ట్యాంకులో దాచాడు. ఈ ఘటన బిలాస్పూర్ లోని ఉస్లాపూపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేసిన తర్వాత ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్ లో దాచిపెట్టాడు. జనవరి 5న ఈ ఘటన జరిగింది.
Another Shraddha-like murder rerun?#chhattisgarhmurder #Chhattisgarhmurdercase #shraddhawalkarmurdercase #bilaspurmurderhttps://t.co/QsAU0aP2fj
— India.com (@indiacom) March 6, 2023
నిందితుడు నకిలీ కరెన్సీ కేసులో అరెస్టు అయ్యాడు. ఆ కేసు నేపథ్యంలోనే పోలీసులు నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు వాటర్ ట్యాంకులో నుంచి దుర్వాసన వచ్చింది. అనుమానంతో వాటర్ ట్యాంక్ మూత ఒపెన్ చేశారు. ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాటర్ ట్యాంక్ లో ని బ్యాగును తెరిచి చూస్తే మృతదేహం కనిపించింది. నిందితుడిని విచారించగా అసలు విషయం బయటపడింది. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. వీరిద్దరి పదేళ్ల క్రితం వివాహం జరిగిందని..ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.