రాకేష్ కుటుంబానికి ఉద్యోగం, రూ. 25 లక్షల పరిహారం: కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

రాకేష్ కుటుంబానికి ఉద్యోగం, రూ. 25 లక్షల పరిహారం: కేసీఆర్

June 18, 2022

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా వాసి రాజేశ్ అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు.

అనంతరం రాకేశ్ కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారంతోపాటు, కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ‘కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు, దుర్మార్గ విధానాలకు వెనుకబడిన తరగతుల బిడ్డలు బలికావడం నన్ను ఎంతగానో కలచి వేసింది. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది. రాకేశ్ దేశానికి సేవ చేయాలని కళలు కన్నాడు” అని కేసీఆర్ కేంద్రంపై మండిపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. గాయపడిన మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ కుటుంబాన్ని ఆయన ఫోన్‌లో పరామర్శించారు.

వరంగల్‌ జిల్లా దబ్బీర్‌ పేట గ్రామానికి చెందిన రాకేష్‌.. ఆర్మీ జవాన్‌ కావాలని కలలు కన్నాడు. నర్సంపేటలో డిగ్రీ పూర్తి చేసి, సోదరి సంగీత ప్రోత్సాహంతోనే ఆర్మీలో చేరాలని కఠోర సాధన చేశాడు. తాజాగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చడంతో శుక్రవారం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆందోళనల్లో పాల్గొన్నాడు. దురదృష్టవశాత్తు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు.