ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ బార్లో మందుబాబులు మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో అనుకోని అతిథిలా కంగారు బార్లోకి ఎంటర్ అయింది. కాసేపు ఉండి ఎవరినీ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తన దారిన తను వెళ్లిపోయింది. ఈ ఘటనను వీడియో తీయగా, అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కంగారు ఆహారం కోసం వచ్చి, దొరక్కపోవడంతో వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కాగా, ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారు. వాళ్ల సంస్కృతికి చిహ్నంగా భావిస్తారు. అదే సమయంలో మనం ఆస్ట్రేలియా క్రికెట్ టీంను కంగారూలు అని సంబోధించడం తెలిసిందే.
View this post on Instagram