A Kerala couple invited the Indian Army to their wedding
mictv telugu

ఇండియన్ ఆర్మీని పెళ్లికి ఆహ్వానించిన వధూవరులు..

November 19, 2022

కేరళకు చెందిన నూతన వధూవరులు చేసిన పని నెట్టింట్ నెటిజిన్ల మన్ననలు పొందుతోంది. పెళ్లికి రావాలంటూ ఇండియన్ ఆర్మీకి ఆహ్వానం పంపిన ఆ జంట.. మీ వల్లే సంతోషంగా ఉన్నామని చెప్పడం ఆకట్టుకుంది. ఇది మా జీవితంలో చూసిన అత్యుత్తమ ఆహ్వాన పత్రిక అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. నవంబర్ 10న పెళ్లి చేసుకోబోతున్న రాహుల్, కార్తీకలు తమ స్వదస్తూరితో ఆర్మీకి ఆహ్వాన లేఖ పంపారు. ‘మీ వల్లే మేం సంతోషంగా పెళ్లి చేసుకోబోతున్నాం. మమ్మల్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుతున్నందుకు మీకు రుణపడి ఉంటాం. ఈ ప్రత్యేక రోజున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మా పెళ్లికి వచ్చి మీ ఆశీర్వాదాలను అందించండి’ అంటూ పత్రికలో రాశారు. దీనికి సైన్యం రిప్లై ఇస్తూ.. ‘దేశం పట్ల మీకున్న ప్రేమ, దేశ భక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నా’మని నోట్ రాసి పంపించింది. ఈ వివాహ ఆహ్వానాన్ని ఇండియన్ ఆర్మీ తన ఇన్‌‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆ జంటకు శుభాకాంక్షలు చెప్పింది. మన రియల్ హీరోల పట్ల మన హృదయాలలో ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇదొక ఉత్తమ మార్గమని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Indian Army (@indianarmy.adgpi)