A Kerala doctor advised the patient to go to a bar and drink alchohol
mictv telugu

భార్యతో ఆస్పత్రికి వెళ్తే.. బార్‌కెళ్లమన్న డాక్టర్

October 21, 2022

వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే ఎవరికైనా ఎక్కడైనా డాక్టరు వైద్యం చేసి మందులు సిఫారసు చేస్తుంటారు. కానీ కేరళలో మాత్రం ఓ డాక్టరు మందులు ఏమీ ఇవ్వకుండా డైరెక్టుగా బార్‌కు వెళ్లి మందుతాగమని ప్రిస్క్రిప్షన్‌లో రాసిచ్చాడు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. త్రిసూరుకు చెందిన 44 ఏళ్ల ప్రియ రెండు నెలలుగా కాలు నొప్పితో బాధపడుతోంది.

దీంతో ఆమె భర్త దయా ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకెళ్లాడు. పరిశీలించిన వైద్యుడు.. ఎక్స్‌రే తీయించి రిపోర్టు చూసి వేరే డాక్టరును పిఫారసు చేశాడు. అయితే నొప్పి ఎక్కువగా ఉందని, ఉపశమనం కోసం ఏమైనా మందులు రాయమని ప్రియ భర్త కోరగా.. ఓ చీటీ మీద కొన్ని మందుల పేర్లు రాసి పంపించేశాడు. దాన్ని పట్టుకొని ప్రియ దంపతులు మెడికల్ షాపుకు వెళ్లగా.. అక్కడున్న వారు దాన్ని చదివి నవ్వుకున్నారు. ఈ మందులు ఇక్కడ దొరకవని, బార్ షాపుకు వెళ్తే దొరుకుతాయని చెప్పడంతో ఆశ్చర్యపోయిన దంపతులు వాళ్లు చెప్పింది విని షాకయ్యారు. దీంతో ఆగ్రహం చెంది ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో దిగి వచ్చిన ఆస్పత్రి యాజమాన్యం సదరు వైద్యుడిని విధుల నుంచి తొలగించింది. విచారణ అనంతరం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.