ఈ రోజుల్లో బిచ్చగాళ్లే రూపాయి తీసుకోవడం లేదు. అలాంటిది ఈ యువకులు ఆ రూపాయి విరాళంగా ఇవ్వండంటూ సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఆ వచ్చిన విరాళంతో పేదలకు ఇళ్లను నిర్మిస్తున్నది.కేరళ ద్వయం.. నిజిన్ కెజి, టి. రెనీష్ ‘ఒక రూపాయిని విరాళంగా ఇవ్వండి, ఎవరైనా జీవితాన్ని మార్చండి’ అనే నినాదంతో ఒక ప్రత్యేకమైన సైకిల్ యాత్రకు బయలుదేరారు.10 డిసెంబర్ 2021న కేరళలోని వాయనాడ్ కు చెందిన నిజిన్.. మొబైల్ టెక్నీషియన్, రెనీష్.. ఉపాధ్యాయులు సైక్లింగ్ యాత్రను చేపట్టేందుకు వారి సంబంధిత ఉద్యోగాలను వదిలేశారు. అయితే ఇది మామూలు ప్రయాణం కాదు. నిజిన్, రెనీష్.. భారతదేశంలోని గ్రామాల గుండా సైకిల్ తొక్కడం ప్రారంభించారు. వారు దారిలో కలిసిన వ్యక్తులను తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వ్యక్తుల కోసం గృహాలను నిర్మించడానికి ఒక రూపాయిని విరాళంగా ఇవ్వాలని కోరారు. శ్రేయోభిలాషులు డబ్బు పరంగా సహకరించడమే కాకుండా.. వీరికి టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, సైకిల్లను కూడా ఇస్తున్నారు.
ఇద్దరూ తమ ఫేస్బుక్, ఇన్ స్టా ద్వారా తమ అప్డేట్స్ ను, ప్రయాణ విశేషాలను, దాతల వివరాలను తెలియచేస్తున్నారు. వారు ప్రస్తుతం మలప్పురం గ్రామాల మీదుగా సైకిల్ పై తిరుగుతున్నారు. అయితే వీరే కాదు.. వీరి నిస్వార్థమైన ఆలోచన గురించి చాలామంది తమ సోషల్ మీడియా ఖాతాల్లో వీరి స్టోరీని షేర్ చేస్తున్నారు. వారు యాత్రలో ఉన్న కూడా.. ముందస్తు చెల్లింపు ఇచ్చిన కాంట్రాక్టర్ ద్వారా గృహాలను నిర్మించడానికి ప్రణాళిక చేశారు. ఒక్కొక్కరు ఐదు నిరుపేద కుటుంబాలకు ఇళ్లను నిర్మించాలని అనుకున్నారు.
పేదవాళ్లకు ఇళ్లు అనేది ఒక కల. దాన్ని తీర్చేందుకు వీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటికి రెండు పడక గదలు, హాలు వంటగది ఉండాలని అనుకున్నారు. ఒక్కో ఇంటికి ఆరు లక్షలతో నిర్మించాలనుకున్నారు. ఇప్పటివరకు 400 గ్రామాల మీదుగా సాగిన 100 కి.మీ.ల ద్వారా వీరు 1.68 లక్షలు వసూలు చేశారు. మొత్తం 42 లక్షలు వచ్చాక యాత్రను ఆపేస్తారు. దీనికోసం మరో రెండేళ్లు పడుతుందని వారు అంచనా వేస్తున్నారు.