టీమిండియా సూపర్ బ్యాట్స్‌మెన్, కింగ్ కోహ్లీకి దేశంలో అభిమాన గణం ఎంత ఉందో తెలిసిందే. వయసు, లింగం భేదం లేకుండా ఆయన ఆటను ఆస్వాదిస్తారు. సచిన్ తర్వాత అంతటి పాపులర్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ పరుగులు, సెంచరీలతో క్రికెట్ దేవుడితో పోటీ పడుతున్నాడు. కానీ ఒక విషయంలో మాత్రం సచిన్ కంటే కోహ్లీనే ఎక్కువ అని చెప్పాలి. కోహ్లీకి మహిళా అభిమానులు విపరీతంగా ఉన్నారు.
Aisi ladkiyon se putle safe nahi hai pic.twitter.com/kaQybcLOOa
— Byomkesh (@byomkesbakshy) February 20, 2023
ఆట, లుక్స్, యాటిట్యూడ్, బాడీ ఫిట్‌నెస్ పరంగా ఇట్టే పడిపోతారు. కానీ ఆటతో ఎంతో బిజీగా ఉండే కోహ్లీ అభిమానులందరికీ అందుబాటులో ఉండరు కనుక అతని మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రతిష్టించారు. నేరుగా కోహ్లీని చూడలేని వారు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు, ఫోటోలు దిగిపోతారు. ఈ క్రమంలో ఓ మహిళా యువ అభిమాని కోహ్లీ మైనపు బొమ్మ పెదాలపై లిప్ కిస్ పెడుతూ కనిపించింది. ముద్దుతో పాటు అమ్మాయి పలికించిన హావభావాలు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవగా, పిక్స్ సైతం అంతే స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి.