A leading star is trolling me and my family: Manchu Vishnu
mictv telugu

నా కుటుంబంపై ట్రోలింగ్ చేయించేది ఆ హీరోనే.. మంచు విష్ణు

September 28, 2022

నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు శ్రమిస్తానని చెప్పాడు హీరో మంచు విష్ణు. ‘జిన్నా’ సినిమా ప్రచారంలో భాగంగా నిర్వహించిన మీమర్స్‌/యూట్యూబర్స్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌పైనా, త‌న కుటుంబ స‌భ్యుల‌పైనా జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై టాలీవుడ్ యువ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌పై, త‌న కుటుంబంపై జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో త‌న‌ను, త‌న కుటుంబాన్ని టార్గెట్ చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. స‌ద‌రు హీరో జూబ్లిహిల్స్‌లోని తన ఐటీ కంపెనీలో త‌న కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నార‌ని విష్ణు ఆరోపించారు.

ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టికే తాను పూర్తి వివ‌రాలు సేక‌రించాన‌ని విష్ణు తెలిపారు. ఆ హీరో న‌డుపుతున్న ఆఫీస్ చిరునామాతో పాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్‌ల‌ను కూడా సేక‌రించాన‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు స‌మ‌గ్ర ఆధారాల‌తో ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పారు. మా ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న‌పై చాలా మంది ట్రోల్ చేశార‌న్న విష్ణు… నాడు వాటిపై అంత‌గా దృష్టి సారించ‌లేద‌ని, అయితే ఇప్పుడు మాత్రం ట్రోలింగ్‌ను స‌హించేది లేద‌ని తేల్చి చెప్పారు.