అడవుల్లో నివాసం ఉంగే క్రూర జంతువులు అక్కడ ఆహారం దొరక్క జనావాసాలకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కోతుల వల్ల రైతులకు పంట నష్టం జరుగుతుండగా, ఈ మధ్య చిరుత పులుల బెడద ఎక్కువైంది. మాంసాహారి అయిన చిరుత పులులు సరైన ఆహారం దొరక్కపోవడంతో ప్రజల వద్దకు వచ్చి దాడి చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూడబోయే వీడియో ఈ కోవకు చెందిందే. చుట్టూ రక్షణ గోడ ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఏకంగా ఓ చిరుత పులి వచ్చి అక్కడ ఉన్న వ్యక్తిపై దాడి చేసింది.
తొలుత వ్యక్తి చేతిని నోటితో కరుచుకున్న చిరుత.. అనంతరం సదరు వ్యక్తి ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గింది. ఇంతలో పక్కనుంచి మరో వ్యక్తి కర్ర విసరగా, అది అందుకున్న బాధిత వ్యక్తిని చూసి చిరుత చల్లగా జారుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుతపులి ఏకంగా స్విమ్మింగ్ పూల్లోకి రావడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.