A life prisoner stuck on a tree while trying to escape from prison
mictv telugu

 జైలు నుంచి తప్పించుకోబోయి చెట్టుపై ఇరుక్కున్న జీవిత ఖైదీ.. వీడియో

July 13, 2022

జైలు జీవితం మనలా సాధారణంగా బయట తిరిగే వారికి తెలియదు కానీ, అందులో శిక్ష అనుభవిస్తున్న వారికి మాత్రం అదో నరకంలా ఉంటుంది. దాన్నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని చూస్తుంటారు. తప్పించుకోవడానికి ఏమాత్రం వీలు చిక్కినా వదలరు. అలా తప్పించుకోబోయిన ఓ జీవిత ఖైదు పడిన ఓ వ్యక్తి చెట్టుపై ఇరుక్కున్నాడు. కేరళలోని పూజప్పుర సెంట్రల్ జైలులో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కిందకి దిగి రావాలని ఎంత బతిమిలాడినా ససేమిరా అన్నాడు. దాంతో అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి వారి వద్ద ఉన్న నిచ్చెన లాంటి పరికరంతో పోలీసులు ఖైదీ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఖైదీ.. తన వద్దకు వస్తే చెట్టుపై నుంచి దూకి చస్తానని బెదిరించాడు. అయినా పోలీసులు వదలకుండా గంటసేపు వివిధ ప్రయత్నాలు చేసి ఖైదీని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.