కొత్త చరిత్ర.. పెట్రోల్‌ను దాటేసిన డీజిల్ ధర - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త చరిత్ర.. పెట్రోల్‌ను దాటేసిన డీజిల్ ధర

October 22, 2018

కుడి ఎడమైతే పొరబాటు లేకపోవచ్చు కానీ జేబులు మాత్రం గుల్లయిపోతాయి. డీజిల్ ధరలు పెరిగిపోతే జనం నానా అవస్థలూ పడతారు. రవాణాపై ప్రభావం వల్ల నిత్యావసరాలు కొండెక్కుతాయి. అందుకే మన నేతామహాశయులు కాస్త విచక్షణ, వివేకం చూపించి డీజిల్ ధరలను పెట్రోల్ ధరలకంటే ఒక పది రూపాయల అడుగు దూరంలో ఉంచేసేవారు. కానీ కాలం మారిపోయింది కదా. దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్లు ఈ విచక్షణకు కూడా పాతరేస్తున్నారు.

tt

అవును.. డీజిల్ ధర చరిత్రలో తొలిసారిగా పెట్రోల్ ధరను మించిపోయింది. పెట్రోల్‌ ధర రూ.80.57 కాగా డీజిల్‌ లీటరు ధర రూ. 80.69గా కొనసాగుతోంది. అంటే 12 పైసలు ఎక్కువ. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లొ సాగుతోందీ వింత. ఇదంతా కేంద్రం అమలు చేస్తున్న ధరల విధాన ఫలితం అని రాష్ట్రం ఆరోపిస్తోంది. తాము ధరలను పెంచడం లేదని, అయినా ఈ చిత్రమైన పరిస్థితి దాపురించిందంటే ఎలా అర్థం చేసుకోవాలనిరాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శశి భూషణ బెహరా ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్ల నుంచి డీజిల్, పెట్రోల్‌ ధరల మధ్య దాదాపు 10 శాతంవ్యత్యాసం కొనసాగుతూ వస్తోంది. అయితే  రూపాయి పతనం, సర్దుబాట్లు పేరుతో కేంద్రం, రాష్ట్రాలు ఎడా పెడా వాయించడంతో ధరలు చుక్కలను తాకుతూ విచక్షణ కోల్పోతున్నాయి.