ఆమె కోసం చాలా మంది ట్రై చేశారు.. కానీ, నాతో మాత్రమే - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె కోసం చాలా మంది ట్రై చేశారు.. కానీ, నాతో మాత్రమే

April 20, 2022

 

నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన ‘అంటే సుందరానికీ’ చిత్ర టీజర్‌ను బుధవారం ఏఎంబీ మాల్‌లో విడుదల చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నానీకి జోడీగా మలయాళ నటి నజ్రియా నజీమ్ నటించింది. ఈ సందర్బంగా నజ్రియా గురించి నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నజ్రియాను తెలుగులో నటింపజేయడం కోసం చాలా మంది నిర్మాతలు, దర్శకులు, హీరోలు ప్రయత్నించారు. కానీ, ఆమె ఎవ్వరి ఫోన్ ఎత్తలేదు. కానీ, దర్శకుడు ఈ చిత్ర కథను చెప్పగానే వెంటనే అంగీకరించింది. అందుకు నజ్రియాకు ధన్యవాదాలు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. టీజర్ కంటే ట్రైలర్, దాని కంటే గొప్పగా సినిమా ఉంటుంద’ని వెల్లడించారు. ‘ఇది నా మొదటి తెలుగు సినిమా. తెలుగు నేర్చుకుని స్వయంగా డబ్బింగ్ చెప్పాను. ఇలాంటి టీమ్‌తో పనిచేయడం ఆనందాన్నిచ్చింద’ని నజ్రియా తెలిపింది. కాగా, ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది.