బాధ్యతగానైనా నటించడంలేదు.. ట్రంప్‌‌పై ఒబామా వ్యాఖ్యలు   - MicTv.in - Telugu News
mictv telugu

బాధ్యతగానైనా నటించడంలేదు.. ట్రంప్‌‌పై ఒబామా వ్యాఖ్యలు  

May 17, 2020

‘A lot of them aren’t even pretending to be in charge’ Obama slams Trump’s handling of Coronavirus pandemic

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అమెరికాలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నా దేశంలో నల్ల జాతీయులపై వివక్ష కొనసాగుతోందని దుయ్యబట్టారు. 

ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా మాట్లాడుతూ.. ‘ కరోనా ప్రజల జీవితాలను సర్వ నాశనం చేసింది. నల్ల జాతీయులు కొన్నేళ్లుగా ఇక్కడ వివక్షకు గురవుతూనే ఉన్నారు. కరోనాతో వివక్ష మరింత ఎక్కువైంది. కొందరు బయటకు వెళ్లిన సందర్భాల్లో హత్యలకు గురవుతున్నారు. కరోనాతో అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు కనీసం తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు కూడా నటించడంలేదు’ అని ఒబామా అన్నారు. కాగా, అమెరికాలో కరోనా కేసల సంఖ్య 15 లక్షలు దాటగా, 90 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్‌లోనే 3.58 లక్షల మంది కోవిడ్‌ బాధితులు ఉండగా, 28వేల మంది మృతిచెందారు. న్యూయార్క్ తర్వాత న్యూజెర్సీ, మిచిగాన్ , ఇల్లినాయిస్‌, మసాచుసెట్స్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా తదితర రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.