a man arrested in kerala with hunting knife
mictv telugu

వీడియో : వేట కత్తితో ఎస్సైపై దాడి.. అరెస్ట్

June 20, 2022

a man arrested in kerala with hunting knife

రోడ్డు పక్కన వాహనం ఎందుకు ఆపావని ప్రశ్నించిన ఎస్సైపై వేట కత్తితో దాడి చేశాడో వ్యక్తి. అయితే ఎస్సై భయపడకుండా సినిమా స్టైల్లో అతడిని కింద పడేసి కత్తిని లాక్కున్నాడు. అనంతరం అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకెళ్లాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో సంఘటన కేరళలో జరిగింది.

అళప్పుళ జిల్లాలోని నూరానాద్ స్టేషన్ ఎస్సై అరుణ్ కుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో పారా జంక్షన్ వద్ద రోడ్డు పక్కన వాహనం నిలిపిన వ్యక్తి వద్ద కారు ఆపగా, ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. కొద్దిసేపయ్యాక సదరు వ్యక్తి తన వద్ద ఉన్న వేట కత్తి తీసి ఎస్సైపై దాడికి యత్నించాడు. ఎస్సై ఏమాత్రం తగ్గకుండా అత్యంత చాకచక్యంగా అతడిని కింద పడేసి కత్తి లాక్కున్నాడు. వాహనంలో ఎక్కించి స్టేషనుకి తరలించారు. కాగా, కత్తి దాడిలో ఎస్సైకి గాయాలవగా, ఆస్పత్రిలో ఏడు కుట్లు వేశారు. దాడి ద‌ృష్యం ఓ వ్యక్తి వీడియో తీసి అప్‌లోడ్ చేయడంతో వైరల్ అవుతోంది.