పచ్చబొట్ల పిచ్చోడు.. ఉద్యోగం ఊడింది..  - MicTv.in - Telugu News
mictv telugu

పచ్చబొట్ల పిచ్చోడు.. ఉద్యోగం ఊడింది.. 

September 29, 2020

A man covered his face with tattoos and turned his eyes black. He says it cost him his kindergarten teaching job

అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని యువత ఈమధ్య పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. వీపుల్లో, చేతులకు, తొడలకు, పిక్కలకు, భుజాలకు, ఛాతీ మీద టాటూలు వేయించుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తికి టాటూలు పిచ్చి ముదిరి పాకాన పడింది. ఆకర్షణీయంగా కాకుండా అంద వికారంగా తయారు కావాలని తహతహలాడాడు. దీంతో అతను ఒళ్లంతా టాటూలు వేయించుకున్నాడు. ఒంటిమీద సందు లేకుండా టాటూలతో నింపేశాడు. అంతటితో ఆగకుండా కళ్లల్లోని తెల్లపొరకు కూడా టాటూలు వేయించాడు. దీంతో అతని కళ్లు పూర్తిగా నల్లగా మారిపోయాయి. గుండు గీయుంచుకుని తలకు కూడా టాటూలను పట్టించాడు. అయితే అతను సాధారణ యువకుడు అయితే ఏ సమస్యా ఉండేది కాదు. అతను ఓ బాధ్యత గల టీచర్. 

స్కూల్లో అతని టాటూల అవతారం చూసిన పిల్లలు జడుసుకునేవారు. పుస్తకాల్లో చదువుకునే బూచాడు టీచర్ అవతారంలో వచ్చాడని పిల్లలు క్లాసులో ఏడుపులు పెడబొబ్బలు మొదలు పెట్టారు. అత‌ని అవ‌తారం చూసిన పిల్లల త‌ల్లిదండ్రులు స్కూల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్కూల్‌ యాజమాన్యం అత‌న్ని ఉద్యోగం నుంచి తీసేశారు. అతని పేరు సిల్వైన్(35). ఫ్రాన్స్‌ దేశంలోని ప‌లైసేలోని డాక్టర్ మోరే ఎలిమెంట‌రీ స్కూల్లో టీచర్‌గా ప‌నిచేస్తున్నాడు. సిల్వైన్‌కు 27 ఏళ్ల వ‌య‌సు నుంచే టాటూల మీద ఇష్టం ఏర్పడింది. ఈ 8 సంవత్సరాల్లో అత‌ని చెవులు, నాలుక‌తో స‌హా దాదాపు మొత్తం శ‌రీరాన్ని సిరాలో మునిగి తేలినంత పనిచేశాడు. కాగా, తనను స్కూల్ నుంచి తొలగించినందుకు అతను కాస్త కూడా బాధపడటం లేదు. ‘త్వరలో నా ప్రొఫెష‌న్‌ను మ‌ళ్లీ కొన‌సాగిస్తా. పిల్లలకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. వారి త‌ల్లిదండ్రులు కూడా నాతో బాగానే ఉంటారు. కాకాపోతే నన్ను దూరం నుంచి చూసి త‌ప్పుగా అర్థం చేసుకున్నారు’ అని సిల్వైన్‌ ఆశాభావం వ్యక్తంచేశాడు.