కూర్చున్న చెట్టునే నరికేశాడు.. వామ్మో ఈ వీడియో చూస్తే.. - MicTv.in - Telugu News
mictv telugu

కూర్చున్న చెట్టునే నరికేశాడు.. వామ్మో ఈ వీడియో చూస్తే..

September 28, 2020

ngvcn

కూర్చున్న కొమ్మను నరికేసుకునేంత అవివేకం ఉండదనే సామెత అందరికి తెలుసు. ఇలా చేయడం వారికే నష్టం అని అంటారు. అందుకే ఎవరూ ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ విధంగా చేయరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తాను కూర్చున్న చెట్టునే నరికేసుకున్నాడు. అది అటూ ఇటూ ఊగిపోతూ ప్రాణాలు గాల్లో తేలుతున్నా ఏ మాత్రం భయం లేకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన వారంతా వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. 

ఓ పొడవాటి తాటిచెట్టు కిందకు వంగిపోయి ప్రమాదకర స్థితిలోకి వచ్చింది. దాన్ని నరికేందుకు ఓ వ్యక్తి పైకి ఎక్కాడు. తాటి మట్టలు ఉండే భాగం కింద కోయడంతో అది పడిపోయింది.  ఆ తర్వాత చెట్టు మిగిలిన భాగం బలంగా అటూ ఇటూ ఊగిపోయింది. దీన్ని మాజీ అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. అది వైరల్ కావడంతో లక్షలాది మంది వీక్షించారు. ఇలా నరికివేయడాన్ని కొంత మంది నెటిజన్లు తప్పుబట్టారు. చెట్టును పలు పద్ధతుల్లో కింద ఉండే నుంచే నరకవచ్చని పేర్కొనగా.. మరికొందరు ఇళ్లపై పడి నష్టం జరుగుతుందనే అలా చేసి ఉంటాడని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఆ వ్యక్తి చేసిన సాహసం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ జరిగిందో మాత్రం చాప్మన్ పేర్కొనలేదు.