పురుషులకు బట్టతల భారంగా మారింది. తలమీద జుట్టు లేకపోకపోవడంతో జీవితంలో ఏదో కోల్పోయిన భావనతో ఉంటున్నారు. కొంతమంది మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో ఎలాగైనా తలపై వెంట్రుకలు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గలవైపు మళ్లుతున్నారు. ప్రధానంగా హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వైపు మొగ్గు చూపి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ విఫలం చెంది ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
టెలివిజన్‌లో పనిచేస్తున్న రషీద్ తన బట్టతలకు జుట్టు మార్పిడి చేయించుకోవాలని ఒక అనుభవం లేని క్లినిక్‌ను సంప్రదించాడు. యూట్యూబ్‌లో వీడియోలను చూసి సొంతంగా శిక్షణ పొందిన వారితో నిర్వహించబడుతున్న హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్లో సర్జరీ చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. అతను గత సంవత్సరం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతను పలు సార్లు ఈ చికిత్స కోసం వచ్చాడు. అయితే అతని తల నుంచి వాపు ఎక్కువ అయ్యి విపరీతమైన నొప్పి వచ్చేది. అలా రాను రాను అనారోగ్యానికి గురై చివరికి ప్రాణాలు విడిచాడు. కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సర్జరీ చేసిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బట్టతల బాధితులు తిరిగి జుట్టు మొలిపించుకునేందుకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సను కోరుకుంటున్నారు.నిపుణులైన డాక్టర్‌ను, క్లినిక్‌కు చేసే సర్జరీలు కొంతమేరు విజయమంతమవుతున్నా..అనుభవం లేని వారు చేస్తున్న సర్జరీల ద్వారా ప్రాణాలు పోతున్నాయి.