మహాలయ అమావాస్య అని.. బాలుడ్ని నరబలి ఇచ్చాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

మహాలయ అమావాస్య అని.. బాలుడ్ని నరబలి ఇచ్చాడు..

October 10, 2018

తనకు మంచి జరుగుతుందని ఓ వ్యక్తి, బాలుడిని  హత్య చేశాడు. ఈ విషయాన్ని ఏకంగా పోలీసులకే చెప్పాడు. బెంగళూరులోని అశోక్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఆర్ముగం (30) అనే వ్యక్తి  భీమణ్న ప్రాంతంలో నివసిస్తుండేవాడు. తన పక్కింట్లో ఉంటున్న సామ్‌వీర్ (6) అనే బాలుణ్ని నరబలి ఇచ్చాడు. భవన నిర్మాణ కార్మికుడైన ఆర్ముగం  నిర్జన ప్రాంతానికి సోమవారం రాత్రి బాలుణ్ని తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలుడి తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  విచారించిన పోలీసులు ఆర్ముగంను అరెస్టు చేశారు. మహాలయ అమావాస్య కావడంతో నరబలి ఇస్తే మంచిదన్న మూఢ విశ్వాసంతో నిందితుడు ఈ హత్య చేసినట్టు ఆర్ముగం తెలిపాడు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారిస్తున్నారు పోలీసులు.A man killed a boy and said he would be better off. This is the uniform of the police