a man non stop smoke in marthan run
mictv telugu

సిగరెట్లు తాగుతూ 42 కి.మీ.మారథాన్

November 16, 2022

అతని వయస్సు 50 సంవత్సరాలు.. 42 కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొన్నాడు. 1500 మందిలో 574 స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 3గంటలా.. 28నిమిషాల్లోనే టార్గెట్‌ను పూర్తి శభాష్ అనిపించుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్న..రన్నింగ్ చేసేటప్పుడు అతడు చేసి ఓ పని మాత్రం షాక్‌కు గురిచేస్తోంది. 42కిలోమీటర్లు నాన్ స్టాప్‌గా పరుగు తీసిన ఇతను.. పరుగు పూర్తయ్యేదాకా సిగరెట్ కాలుస్తూనే కనిపించాడు. ప్యాకెట్లు కొద్ది సిగరెట్లను ఊదేసిస్తూ పరుగు పెట్టాడు. చైనాలోని జియాండే లో జిన్ జియాంగ్ మారధాన్ రన్‌‌లో ఈ ఘటన జరిగింది.

స్థానికులు మాత్రం ఇది తమకు కొత్తకాదు అంటున్నారు. గతంలోనూ అతను ఇదే విధంగా స్మోక్ చేస్తూ పరుగులు తీశాడని చెబుతున్నారు. 2018, 2019 సంవత్సరాలలో జరిగిన మారథాన్‌లలోనూ ఇతడు ఇలాగే సిగరెట్స్ తాగుతూ తన పరుగును కొనసాగించాడంటున్నారు. అందరూ అతడిని ముద్దుగా స్మోకింగ్ బ్రదర్ అని కూడా పిలుస్తారని తెలిపారు.

ఇతని పరుగును చూసినవారిలో కొందరు ఇంత వయసులో ఇతని ఫిట్నెస్ అమోఘం, అన్ని కిలోమీటర్ల పరుగు అంటే సామాన్యమైన విషయం కాదు అని కితాబు ఇస్తుంటే..మరికొందరు సిగరెట్లు అన్ని ఎక్కువ తాగడం మంచిది కాదని సూచిస్తున్నారు.