A man was caught smoking in the plane's toilet on an Air India flight from London to Mumbai.
mictv telugu

Air India:ఫ్లైట్ బాత్రూంలో ప్రయాణీకుడి వెర్రిచేష్టలు..చేతులు కాళ్లు కట్టేసిన సిబ్బంది

March 12, 2023

A man was caught smoking in the plane's toilet on an Air India flight from London to Mumbai.

ఈమధ్యకాలంలో విమానాల్లో ప్రయాణికులు చేసే వెర్రిచేష్టలు చిరాకు తెప్పిస్తున్నాయి. ఎయిర్ ఇండియా పీ గేట్ కేసు తర్వాత ఇప్పుడు మరో షాకింగ్ కేసు తెరపైకి వచ్చింది. లండన్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 37 ఏళ్ల వ్యక్తి విమానం టాయిలెట్‌లో పొగ తాగుతూ పట్టుబడ్డాడు. ఎయిర్ ఇండియా సిబ్బంది ఈ విషయం గురించి సహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫ్లైట్‌లో సిగరేట్ కాల్చేందుకు పర్మిషన్ ఉండదు. ప్రయాణీకుడు బాత్రూంలోకి వెళ్లి సిగరేట్ తాగడంతో ఫ్లైట్ అలారం మోగింది.

 

దీంతో సిబ్బంది అంతాకూడా బాత్రూం వైపు పరుగులు తీశారు. ప్రయాణీకుడి చేతిలో నుంచి సిగరేట్ తీసేశారు. ప్రయాణీకుడు రమాకాంత్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు. నానా రచ్చ చేశాడు. ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. సిబ్బందిపై బూతుల వర్షం కురిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని చేతులు, కాళ్లు కట్టేశారు సిబ్బంది.

అతని ప్రవర్తనతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది సహర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు భారతీయ సంతతికి చెందినవాడని, అయితే అతను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పౌరుడు, అమెరికన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.