A man who cut off his penis in his sleep
mictv telugu

కలలో మేక తల అనుకొని ఇంకేదో కోసేశాడు.. లేచి చూస్తే షాక్

August 24, 2022

మనుషులకు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. కొందరు నిద్రలో మాట్లాడుతుంటారు. నిద్రలోనే నడుస్తుంటారు. కొందరు ఏ ఫీలింగ్ లేకుండా కూడా అలాగే కనేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనకు నిద్రలో వచ్చిన కలను నిజం అనుకొని అచ్చం కలలో జరిగినట్టే చేయడం మొదలెట్టాడు. మాంసాహారం అంటే ఇష్టమున్న సదరు వ్యక్తికి మేక తలను కోస్తున్నట్టు కల రాగా, నిజమే అనుకొని నిద్రమత్తులో తన మర్మాంగాన్ని కత్తితో కోసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన ఆఫ్రికా ఖండంలోని ఘనా దేశంలో జరిగింది. కోఫీ అట్టా అనే రైతుకు మటన్ అంటే చాలా ఇష్టం. భోజనంలో ముక్క లేనిదే ముద్ద నోట్లో దిగదు. ఈ క్రమంలో ఓ రోజు మటన్ దొరక్కపోవడంతో తన భార్యను చికెన్ వండాలని చెప్పి, ఆలస్యమవుతుండడంతో ఆలోపు నిద్రలోకి జారుకున్నాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అతనికి కల వచ్చింది. అందులో మేక తలను కోస్తున్నాననుకొని ఓ కత్తి పుచ్చుకొని తన పురుషాంగాన్నే కోసుకున్నాడు. కాసేపటికి నొప్పితో మెలకువ రాగా, కళ్లు తెరచి చూస్తే జరిగిన ఘోరం అర్ధమైంది. దీంతో కుటుంబ సభ్యులను అప్రమత్తం చేయగా, వారు రైతుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.