ప్రేయసిని చంపి పాతిపెట్టి.. దాని బొంద మీదే కర్మ అనుభవించాడు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేయసిని చంపి పాతిపెట్టి.. దాని బొంద మీదే కర్మ అనుభవించాడు

May 12, 2022

హిందూ సాంప్రదాయంలో ఉన్న కర్మ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే దాని ఫలితాన్ని తప్పక అనుభవిస్తాడు అంటారు. ఒక్కో యుగంలో ఒక్కోలా ప్రతీకార సమయం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కలికాలం నడుస్తుంది కాబట్టి చేసిన తప్పులకు శిక్ష ఇదే జన్మలో బతికుండగానే అనుభవిస్తారు అని చెప్తారు. ఇప్పుడు చెప్పబోయే సంఘటన సరిగ్గా దీనికి సరిపోతుంది. అమెరికాలో 60 ఏళ్ల వ్యక్తి, 65 ఏళ్ల వయసున్న మహిళతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు రాగా, కోపంతో ఆ వ్యక్తి మహిళ గొంతు నొక్కి హత్య చేశాడు. అనంతరం ఎవ్వరికీ తెలియకుండా తన ఇంటి వెనకాలు గొయ్యి తవ్వి శవాన్ని పాతిపెట్టాడు. మట్టి పూడ్చడం అయిన తర్వాత వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి మహిళను పాతిపెట్టిన సమాధి మీదే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. కొంతసేపటికి పక్కింటి వాళ్లకు అనుమానం వచ్చి చూడగా, ఈ విషయం బయటపడింది. పోలీసులను పిలవడంతో వారు వచ్చి వ్యక్తితో పాటు మహిళ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించగా, రిపోర్టులో పై విషయం బయటపడింది. దీంతో చేసిన పాపానికి వెంటనే శిక్ష పడిందని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.