A man who narrowly escaped an accident brazil
mictv telugu

ఇతనికి భూమి మీద నూకలున్నాయ్.. షాకింగ్ వీడియో

May 31, 2022

A man who narrowly escaped an accident brazil

ఒక్కోసారి ప్రమాదం జరిగిన వీడియోలు చూస్తుంటే షాకింగ్‌గా అనిపిస్తాయి. అందులో చావు తప్పించుకున్న వ్యక్తులను చూస్తే హెడ్డింగ్‌లో ఉన్న మాటను మన దగ్గర వాడుతారు. సరిగ్గా ఈ వాక్యం సరిపోయే ఘటన ఒకటి బ్రెజిల్‌లో జరిగింది. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డు పక్కన పుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలో వెనుకనుంచి ఓ ట్రక్ వస్తుంటుంది.

ట్రక్కు వ్యక్తి దగ్గరకు రాగానే రోడ్డుపై ఉన్న ఓ చెట్టు కొమ్మను తాకి ట్రక్కు వెనుక బాడీలో ఉన్న సరుకు పైకి లేస్తుంది. దానితో పాటే ట్రక్కు ముందరి భాగం కూడా పైకిలేచి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని పక్కనుంచి గుద్దుకుంటుంది. వ్యక్తికి ఓ పక్క గోడ, మరోపక్క ట్రక్కు మధ్యలో ఇరుక్కున్నా కూడా ఆ వ్యక్తికి ఏం కాలేదు. దీంతో ఆ వ్యక్తి భయపడి పారిపోగా, ట్రక్కులో ఉన్న డ్రైవరు మెల్లగా కిందకు దిగుతాడు. 37 క్షణాలు ఉన్న ఈ వీడియోలోని సంఘటన ఈ నెల 23వ తేదీన జరిగింది. వీడియో బైటకి రావడంతో వైరల్ అవుతోంది.