గూగుల్‌ పే స్క్రాచ్ కార్డుతో ఏకంగా రూ. లక్ష  బహుమతి గెలిచాడు - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్‌ పే స్క్రాచ్ కార్డుతో ఏకంగా రూ. లక్ష  బహుమతి గెలిచాడు

February 29, 2020

cbc

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగా పలు యాప్‌లు నగదు బదీలీ చేస్తే ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా గూగుల్‌పే లక్ష రూపాయల వరకు కూడా నగదు బహుమతి గెలుచుకోవచ్చని ప్రతిసారి చూపిస్తుంది. కానీ ఇలా గెలుచుకున్న వారు ఎక్కడా కనిపించలేదు. అసలు ఆ బహుమతి ఉందో లేదో అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. కానీ ఓ వ్యక్తిని మాత్రం నిజంగానే ఈ అదృష్టం వరించింది.

అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్‌ శుక్రవారం తన స్నేహితుడికి నగదు పంపించాడు. గూగుల్ పే యాప్ ద్వారా రూ.3 వేలు బదిలీ చేశాడు. ఆ వెంటనే అతనికి ఓ స్ట్కాచ్ కార్డు వచ్చింది. ఎప్పటిలాగే అతడు సాధాసీదాగా స్క్రాచ్ చేశాడు. కానీ దాన్ని చూసిన వెంటనే తాను చూసిన నంబర్ నమ్మలేకపోయాడు. కొద్దిసేపటికే తన అకౌంట్లో రూ. 1,00,107 జమ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. తనకు వచ్చిన రివార్డు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిజమా కాదా అని తేరుకోవడానికే కొంత సమయం పట్టింది. ఆ ఆఫర్ చూసిన అతని ఆనందానికి అవధులేకుండా పోయాయి. ఈ విషయం తెలిసిన వారంతా ఆయన అదృష్టంపై చర్చించుకుంటున్నారు.