ఈ మధ్య పెళ్లిళ్ల ముహూర్తాలు చాలా ఉండడంతో పెళ్లిళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో సమాజం కోసం, పరువు కోసం పెళ్లి చేసుకుంటున్న యువత.. పెళ్లయిన వెంటనే కట్టుకున్న వారిని వదిలేసి, ఏమాత్రం విలువలు లేకుండా ప్రేమికులతో లేచి పోతున్నారు. వారిని చేసుకున్నందుకు అవతలి వారి మనసు ఎంత గాయపడుతుందో లేచిపోయిన వారికి తెలియదు. ఈ క్రమంలో చాలా మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
తాజాగా ఒడిషాలోని భువనేశ్వర్లో ఇలాంటి ఘటన జరిగింది. నగరానికి చెందిన బలరామ్ అనే వ్యక్తి గోవిందాపూర్కు చెందిన యువతిని ఈ నెల 12న వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత అత్తారింటికి వెళ్లిన నవ వధువు తన ప్రియుడితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ భర్తకు దొరికిపోయింది. భర్త ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమించమని, ఇంకెప్పుడూ చేయనని కోరింది. దాంతో భర్త శాంతించగా, అదే అదనుగా భార్య గుడికి వెళదామని భర్తను అడిగింది. సరేనని చెప్పి భర్త భార్యను గుడికి తీసుకెళ్లగా, గుడిలో తన భార్య కుటుంబ సభ్యులతో పాటు మరో యువకుడు ఉన్నాడు. దాంతో భయాన్ని వదిలేసిన యువతి భర్తను కొట్టి అతని కళ్ల ముందే ఆ యువకుడితో లేచిపోయింది. పోతూ పోతూ భర్తకు సంబంధించిన బంగారు నగలు, రూ. 1.50 లక్షలను తీసుకెళ్లింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బలరామ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు కాపాడడంతో బతికాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పారిపోయిన జంటను గాలిస్తున్నట్టు వారు తెలిపారు.