A massive fire broke out in a house in UP's Kanpur due to a short circuit, five people were burnt alive.
mictv telugu

ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం, ఐదుగురు సజీవదహనం, మృతుల్లో ముగ్గురు చిన్నారులు

March 12, 2023

A massive fire broke out in a house in UP's Kanpur due to a short circuit, five people were burnt alive.

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో భారీగా మంటలు చెలరేగి 5గురు సజీవదహనం అయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంతోనే మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్మౌ బంజరదేరా గ్రామంలో జరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌తో కలిసి విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సతీష్ కుమార్ ఆయన భార్య కాజల్, ముగ్గురు పిల్లలు కలిసి నిద్రిస్తున్నట్లు సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అర్థరాత్రి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కేకలు వేశారు. అరుపులు విన్న స్థానికులు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాలేదు. మంటల్లోనే ఐదుగురు సజీవదహనమయ్యారు. మంటలను ఆర్పే క్రమంలో సతీష్ తల్లి కూడా తీవ్రంగా గాయపడింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.