a memory losed husband sold his poperty worth 2 crores
mictv telugu

HYD జ్ఞాపక శక్తి కోల్పోయిన భర్త.. 2 కోట్ల ఆస్తి అమ్మేశాడు

August 12, 2022

ఆపరేషన్‌తో జ్ఞాపక శక్తి కోల్పోయిన భర్త హైదరాబాదులో రెండు కోట్ల ఆస్తిని అమ్మేశాడు. భార్య ఫిర్యాదుతో బంజారా హిల్స్ పోలీసులు భర్తపై మెంటల్ కేసు నమోదు చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ఘటన వెనుక జరిగిన సంఘటనల వివరాలిలా ఉన్నాయి. బంజారా హిల్స్ సౌభాగ్య కాలనీలో నివసించే ఐనాల వెంకట రాంప్రసాద్ కంప్యూటర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. ఆయన తల్లిదండ్రులు చనిపోగా, భార్య వాసవి, 15 ఏళ్ల కూతురుతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓసారి రాంప్రసాద్‌కు తీవ్ర తలనొప్పి రాగా, వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. డాక్టర్లు టెస్టులు చేసి ట్రానిటనీ వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియాగా గుర్తించగా, చికిత్సలో భాగంగా ఆపరేషన్ చేసి ఇంటికి పంపించేశారు.

తర్వాత కొద్ది రోజులకు రాంప్రసాద్ జ్ఞాపక శక్తి పూర్తిగా కోల్పోవడంతో ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఈ క్రమంలోనే ఓ సారి ఇంట్లోంచి పారిపోతే భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు వెతికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోమని సూచించి వెళ్లిపోయారు. అయితే ఇటీవల మదీనాగూడలోని బీహెచ్ఈఎల్ – హెచ్ఐజీ ఫేజ్ 3 లో ఉన్న ఇంటిని పద్మ అనే మహిళకు భర్త విక్రయించినట్టు భార్య వాసవి గుర్తించింది. భర్త ఖాతాను చెక్ చేయగా అందులో డబ్బు జమకాకపోవడంతో అనుమానం వచ్చి దస్తావేజులను పరిశీలించగా, రెండు కోట్ల ఆస్తిని రూ. 50 లక్షలకే అమ్మినట్టు తెలుసుకుంది. దీంతో మోసపోయానని భావించి న్యాయం చేయాలంటూ వాసవి కోర్టును ఆశ్రయించింది. కేసును పరిశీలించిన కోర్టు భర్తపై మెంటల్ హెల్త్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.