మైనర్ బాలికపై వృద్ధుడి ‘డిజిటల్ రేప్’ - MicTv.in - Telugu News
mictv telugu

మైనర్ బాలికపై వృద్ధుడి ‘డిజిటల్ రేప్’

May 16, 2022

మైనార్టీ తీరని ఓ బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ రేప్‌కు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 17 ఏళ్ల మైనర్ బాలిక నోయిడాలో తెలిసిన వారి ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. అయితే బాలిక ఉంటున్న ఇంటి యజమానికి మారిస్ రైడర్ అనే స్నేహితుడు ఉండేవాడు.

ఆర్టిస్ట్ టీచర్ అయిన అతను తన స్నేహితుడిని కలవడానికి తరచూ బాలిక ఉంటున్న ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో బాలిక టీచర్ వద్ద బొమ్మలు ఎలా వేయాలో మెళకువలు నేర్చుకునేది. ఈ క్రమంలో ఏడేళ్ల నుంచి బాలిక ఇంట్లో ఉన్న సమయంలో వృద్ధుడు బాలికను వేధించేవాడు. డిజిటల్ రేప్‌కు పాల్పడేవాడు. డిజిటల్ రేప్ అంటే బలవంతంగా బాలిక శరీరంలోని ప్రైవేటు భాగాల్లో బలవంతంగా చేతివేళ్లు, కాలి వేళ్లు జొప్పించడం. అయితే తనకు ఎవరూ లేకపోవడంతో కొన్నాళ్లు అతడి వేధింపులను భరించిన బాలిక.. అతన మరీమితిమీరడంతో ధైర్యం తెచ్చుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.