ప్రియా ప్రకాశ్‌లా కన్నుకొడితే ఏడాది వేటు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియా ప్రకాశ్‌లా కన్నుకొడితే ఏడాది వేటు

March 19, 2018

కన్నుకొట్టడం.. అనే మాట వినగానే మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియరే కళ్లముందు చిలిపిగా దర్శనమిస్తుంది. కేవలం కన్నుకొట్టి రాత్రికి రాత్రి నేషనల్ సెలబ్రిటీ అయిపోయిన ఈ కుర్రదానికి యూత్‌లో భయంకరమైన క్రేజ్ ఉంది. చాలామంది అమ్మాయిలు.. ఈమెలా కన్నుకొట్టడం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇదంతా బాగానే ఉందిగాని, ఈ పిచ్చివల్ల చదువులు అటకెక్కుతున్నాయి. పైగా అబ్బాయిలు ఈ కన్నుగీట్లకు తట్టుకోలేక చిత్తయిపోతున్నాయి. ఈ తతంగమంతా కెరీర్‌పై దుష్ప్రభావం చూపుతోందని ఓ కాలేజీ ముందు జాగ్రత్తలు తీసుకుంది. కాలేజీలో అమ్మాయిలు కన్నుకొడితే వారిని ఏడాదిపాటు కాలేజీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. తమిళనాడులో వీఎల్బీ జానకి అమ్మల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనే కాలేజీ ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రియను చూసి చాలామంది అమ్మాయిలే కన్నుకొట్టడమే పనిగా పెట్టుకున్నారని, దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని యాజమాన్యం తెలిపింది.